287వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం
అమరావతి రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు చేస్తున్న

అమరావతి రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం 287వ రోజుకు చేరింది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ దీక్షా శిబిరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలుకు ప్రభుత్వాల మీద నమ్మకంపోతుందని హెచ్చరించారు. ప్రాణ త్యాగాలకైనా వెనకాడమని.. అమరావతినే రాజధానిగా కొనసాగేలా చేస్తామని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రైతుల నిరసనలు తెలుపుతున్నారు.
Next Story