రాజకీయాల కోసమే మూడురాజధానులు - అమరావతి జేఏసీ

రాజకీయాల కోసమే మూడురాజధానులు - అమరావతి జేఏసీ
అమరావతి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని మండిపడ్డారు రాజధాని రైతు జేఏసీ నేతలు. ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు..

అమరావతి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని మండిపడ్డారు రాజధాని రైతు జేఏసీ నేతలు. ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. రైతులు, రైతుకూలీల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని, లేదంటే ప్రజలు తగిన బుద్దిచెబుతారని వారు మండిపడ్డారు. కేవలం రాజకీయాల కోసమే మూడు రాజధానులను ముందుకు తెచ్చారన్నారు.

Tags

Next Story