మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం

మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం
దీక్షా శిబిరంలో ఉన్నవారిని లాగి పడేశారు

అమరావతిలో మళ్లీ పోలీసులు రైతులపై పడ్డారు. అమాయక మహిళా రైతులతో దురుసుగా ప్రవర్తించారు. దీక్షా శిబిరంలో ఉన్నవారిని లాగి పడేశారు. శాంతియుతంగా దీక్షా శిబిరంలో ఉంటే.. బిలబిలమంటూ వచ్చిన పోలీసులు తమను లాగిపడేసి, బూతులు తిట్టారంటూ మహిళలు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రాజధానికి భూములిచ్చిన తమపై ఎందుకింత దాష్టీకమని ప్రశ్నిస్తున్నారు.

అమరావతిలో ఉదయం నుంతీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై తుళ్లూరులో 48 గంటల దీక్ష చేయడానికి వచ్చిన న్యాయవాది జడ శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను త రలించారు. అంతముందు దీక్షా శిబిరం వద్దకు రైతులు రావొద్దంటూ.. హుకుం జారీ చేశారు. ఒక వేళ దీక్షకు మద్దతు తెలిపితే లాఠీ ఛార్జ్ చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story