ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోన్న అమరావతి నినాదం

ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోన్న అమరావతి నినాదం

అమరావతి నినాదం ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోంది. హస్తిన వీధుల్లో ఉద్యమహోరు వినిపించేలా, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది మహిళా జేఏసీ. అమరావతిని కాపాడాలంటూ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌తో సమావేశమయ్యారు మహిళా జేఏసీ నేతలు. రైతుల త్యాగాలతో పాటు వారి సమస్యలను అరవింద్‌ సావంత్‌కు వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌.. రైతుల త్యాగాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. త్యాగాలు చేసి భూములు ఇచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. రాజధాని అంశాన్ని రాజకీయం చేయకుండా.. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో లేవనెత్తితే మద్దతు ఇస్తామన్నారు అరవింద్‌ సావంత్‌.

Tags

Read MoreRead Less
Next Story