జస్టిస్ రాకేష్ కుమార్‌కు అమరావతి రైతులు, మహిళలు ఘనంగా వీడ్కోలు

పదవీ విరమణ చేసిన ఏపీ హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్‌కు అమరావతి రైతులు, మహిళలు ఘనంగా వీడ్కోలు పలికారు.. మధ్యాహ్నం సమయంలోనే పెద్ద సంఖ్యలో హైకోర్టుకు దగ్గరకు వెళ్లిన రాజధాని గ్రామాల రైతులు పూలు, ప్లకార్డులు పట్టుకుని మానవ హారంగా నిలబడ్డారు.. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా తేడా లేకుండా అంతా రోడ్డు మీదకు వచ్చారు.. హైకోర్టు నుంచి వెళ్లే రహదారిలో రెండు వైపులా జస్టిస్ రాకేష్ కుమార్ లాంగ్ లివ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.. పదవీ విరమణ అనంతరం అదే దారిలో జస్టిస్ రాకేష్ కుమార్ వెళ్లగా.. రైతులంతా మోకాళ్లపై నిలబడి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.. న్యాయం వైపు నిలబడి పోరాటం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.. దారిపొడవునా రైతులకు అభివందనం చేస్తూ ముందుకెళ్లారు జస్టిస్ రాకేష్ కుమార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com