AMARAVATHI: అమరావతికి మరో శుభవార్త

AMARAVATHI: అమరావతికి మరో శుభవార్త
X
హడ్కో, సీఆర్డీఏ మధ్య కీలక ఒప్పందం... రూ. 11,000 కోట్ల రుణం అందించనున్న హడ్కో

ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త అందింది. అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఇప్పటికే ప్రపంచబ్యాంక్ అంగీకరించగా.. తాజాగా హడ్కో కూడా ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో, సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి నిర్మాణానికి గానూ హడ్కో రూ.11000 కోట్లు రుణం ఇవ్వనుంది. ఏపీ మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో అమరావతి రాజధానికి నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో త్వరలో రాజధాని నిర్మాణ పనులకు నిధులు విడుదల కానున్నాయి. త్వరలో నిధులను విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్‌ కుల్‌శ్రేష్ఠ పాల్గొన్నారు.

అమరావతి నిర్మాణం దిశగా కీలక అడుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణపైన దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు నిర్మాణాలపై కసరత్తు చేస్తోంది. పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది. కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్దమైంది.

అమరావతికి తలమానికంగా ఐకానిక్ టవర్లు

అమరావతి సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్‌ టవర్లకు వచ్చే వారం టెండర్లు పిలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు రూ. 4,687 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదించింది. ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు. జేఏడీ టవర్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్ ఫ్లోర్‌ కాకుండా 47 అంతస్తులు కాగా, మిగిలిన 4 హెచ్‌ఓడీ టవర్లు 39 అంతస్తులుగా డిజైన్‌ చేశారు.

చంద్రబాబే పూర్తి చేస్తారు

అభివృద్ధికి చిరునామా సీఎం చంద్రబాబు అని అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. గత వైసీపీ ప్రభుత్వం విజన్ లేకపోవడంతో పోలవరం, అమరావతి గాలికి వదిలేసారన్నారు. సీఎం 2047 విజన్తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అమరావతి, పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని వెల్లడించారు.

Tags

Next Story