AMBATI: రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి రాంబాబు

ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు మొబైల్ కోర్ట్. దానితో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. అంతకు ముందు అంబటికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబటికి ఒక కేసులో మాత్రం అంటే పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాత్రం స్టేషన్ బెయిల్ లభించింది. కానీ సీయంపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాత్రం కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. దానితో ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు.రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు నమోదు చేశారు. అంబటిపై 16 క్రిమినల్ ఫిర్యాదు లు నమోదయ్యాయని.. అయన ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉంటే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని కాబట్టి కొంతకాలం రిమాండ్ లో ఉంచాలని కోరారు.
"వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి"
భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్తో పాటు వైకాపా నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్, రోజా చేసిన మురికి వ్యాఖ్యల వీడియోలను ఆయన ప్రదర్శించారు. నాలుగు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల్లో ఆగ్రహం ఉంటుందని గంటా శ్రీనివాసరావు అన్నారు. వైకాపా హయాంలో ఆయన్ను విశాఖ ఎయిర్పోర్ట్లో ఘోరంగా అడ్డుకున్నారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
