Ambati Rayudu: వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా..

వైఎస్సార్‌సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నానని ట్విట్టర్ (ఎక్స్)లో వెల్లడించారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.. భవిష్యత్ కార్యాచరణ గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు.
ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అధికారి పార్టీ వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇటీవల వైసీపీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు.. తాజాగా పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా... కొంత కాలం పాలిటిక్స్ కు దూరంగా ఉండాలనుకుంటున్నా.. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా' అని అంబటి తెలిపాడు. సడన్ గా రాయుడు డెసిషన్ మార్చుకోవడంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత రాయుడు.. గత నెల 28న సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో చేరి పది రోజులు కూడా కాకుండానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఏపీలో హాట్ టాఫిక్ గా మారింది. గత కొంతకాలంగా రాయుడు పొలిటికల్ కెరీర్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దానికి అనుగుణంగా అంబటి కూడా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. ఇదే క్రమంలో వైసీపీ అనుకూలంగా మాట్లాడూతూ.. జగన్ పాలనపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అంబటి పోటీ చేయడం ఖాయమనుకున్న తరుణంలో.. పార్టీని వీడితున్నట్లు సడన్ గా షాకిచ్చాడు రాయుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com