CBN: మళ్లీ అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన

CBN: మళ్లీ అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన
X
సుపరిపాలనే లక్ష్యమని ప్రకటించిన చంద్రబాబు

చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైసీపీ పాలకులు అమరావతిని ఎడారి అన్నారని.. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు... అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగమే కారణం

కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేడ్కర్‌ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది." అని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన పార్టీ తెలుగుదేశమని గుర్తు చేశారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పేదలకు అండగా ఉంటానని అందరికీ హామీ ఇస్తున్నానని తెలిపారు. అమరావతికి ప్రతిష్ఠాత్మక వర్సిటీలు తరలివస్తున్నాయని.. సబ్‌ప్లాన్‌ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.

Tags

Next Story