Ambedkar Konaseema : టీడీపీలోకి వలసలు

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు కొత్తకోట టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు . అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు పార్టీలకు చెందిన యాభై కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సత్యానందరావు.. పార్టీ కోసం పని చేసిన వారికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సత్యానందరావు అన్నారు.
నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా ఎనిమిదోవ రోజు లోకేష్ పలమనేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రొంపిచర్లకు వెళ్లిన లోకేష్‌కు యువత ఘన స్వాగతం పలికారు. వైసీపీ కార్యకర్తల దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి తమపై దాడి చేయించారని లోకేష్ కు చెప్పారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. పైగా తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు లోకేష్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని.. కార్యకర్తల త్యాగాలను పార్టీ మరువదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన ఏ ఒక్క అధికారిని వదలేది లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com