నేడు విశాఖలో అమిత్ షా బహిరంగ సభ

నేడు విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖకు చేరుకోనున్నారు. 6 నుంచి 7 గంటల వరకూ రైల్వే గ్రౌండ్స్ లో బహిరంగ సభ లో పాల్గొననున్నారు అమిత్ షా. ఆ తర్వాత సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకూ పోర్ట్ సాగర మాల ఆడిటోరియంలో బీజేపీ కేంద్ర ప్రముఖులతో సమావేశమై రానున్న ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు.
అమిత్ షా వస్తున్న నేపధ్యంలో విశాఖలో నిరసనలు చేయడానికి పోరాటకమిటీ నాయకులు సిద్దమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్ లో ఉదయం 8 గంటల నుంచి పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనల జరుగుతున్నాయి. ఉదయం 10.30 కి వామపక్షాల ఆధ్వర్యంలో రైల్వే డి.ఆర్.ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ నిరసన ర్యాలీ జరుగనుంది. నిరసనల నేపథ్యంలో నగరంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com