ఏపీ హైకోర్టు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు అమరావతి రైతులు ఘన వీడ్కోలు

ఏపీ హైకోర్టు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు అమరావతి రైతులు ఘన వీడ్కోలు
పదవీ విరమణ అనంతరం అదే దారిలో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వెళ్లగా రైతులంతా మోకాళ్లపై నిలబడి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం వైపు నిలబడి పోరాటం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పదవీ విరమణ చేసిన ఏపీ హైకోర్టు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు అమరావతి రైతులు, మహిళలు ఘనంగా వీడ్కోలు పలికారు. పెద్ద సంఖ్యలో హైకోర్టుకు దగ్గరకు వెళ్లిన రాజధాని గ్రామాల రైతులు పూలు, ప్లకార్డులు పట్టుకుని మానవ హారంగా నిలబడ్డారు.. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా తేడా లేకుండా అంతా రోడ్డు మీదకు వచ్చారు.. హైకోర్టు నుంచి వెళ్లే రహదారిలో రెండు వైపులా జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ లాంగ్‌ లివ్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

పదవీ విరమణ అనంతరం అదే దారిలో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వెళ్లగా రైతులంతా మోకాళ్లపై నిలబడి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం వైపు నిలబడి పోరాటం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దారిపొడవునా రైతులకు అభివందనం చేస్తూ ముందుకెళ్లారు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌.

జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ బీహార్‌లోని పాట్నా హైకోర్టు నుంచి గత ఏడాది ఏపీ హైకోర్టుకు వచ్చారు. అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో రైతలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వారి మనసును చూరగొన్నారు. జగన్‌ సర్కారుకు అనేక జలక్‌లు ఇచ్చారు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌. రాజధాని అమరావతి తరలింపు తోపాటు, మిషన్‌ బిల్డ్‌, ఏపీ ప్రభుత్వ , కార్యాలయాలకు రంగులు, అభ్యంతరకర పోస్టులు, తదితర అంశాలపై నిక్కచ్చితమైన తీర్పు ఇచ్చారు జస్టిస్‌ రాకేష్‌ కుమార్.

Tags

Read MoreRead Less
Next Story