అమరావతి ఉద్యమం మరింత ఉధృతంచేస్తాం - జేఏసీ
BY kasi14 Nov 2020 8:36 AM GMT

X
kasi14 Nov 2020 8:36 AM GMT
అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు జేఏసీ నాయకులు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లుచేస్తున్నామనివెల్లడించారు. దీనిలో భాగంగా రేపు తుళ్లూరులో అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఏర్పాట్లుచేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి ధూమ్ ధామ్ పేరిట ఆటపాటలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇది ఉద్యమానికి కొత్త ఊపు ఇస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలది కాదని..5కోట్ల ఆంధ్రులదన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతామని, ఇందులో అందరుపాల్గొనాలని కోరారు.
Next Story