కాళ్లు పట్టుకున్నా కనికరం చూపని ఆర్డీఓ

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో వైసీపీ రైతు గోడు అక్కడి అధికారులకు పట్టలేదు. కాళ్లు పట్టుకున్నా కనికరం చూపలేదు. దీంతో అధికార పార్టీకి చెందిన రైతు ఆవేదన ఇపుడు అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. మూలగిరిపల్లికి చెందిన శ్రీనివాసులు అనే రైతు కుటుంబానికి 7.84 ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు రెవెన్యూ అధికారులు. దీంతో 22A నిషేధిత భూముల నుంచి తన భూమిని తొలగించాలని గుంతకల్ ఆర్డీఓ కాళ్లు పట్టుకున్నారు. అయినా ఆర్డీఓ పట్టించుకోలేదు. సమస్య ఏంటో తెలుసుకుంటానంటూ అక్కడి నుంచి ఆర్డీఓ వెళ్లిపోయారు.అధికారులపై తీరుపై రైతు శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. తాను కూడా వైసీపీ కార్యకర్తనే అని అన్నారు. వైసీపీ ముఖ్య నేతల ఫైళ్లు ఆగమేఘాల మీద కదులుతాయి కానీ తమలాంటి సామాన్య కార్యకర్తల ఫైళ్లు పట్టవా? అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని శ్రీనివాసులు మండిపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com