ANAKAPALLI: అనకాపల్లిలో 3 వేల ఎకరాల్లో బార్క్ భారీ క్యాంపస్

ANAKAPALLI: అనకాపల్లిలో 3 వేల ఎకరాల్లో బార్క్ భారీ క్యాంపస్
X
అణు పరిశోధనలకు కీలక కేంద్రంగా ఏపీ

భారత అణు­శ­క్తి పరి­శో­ధ­న­ల్లో కీలక పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. దే­శం­లో అణు శా­స్త్ర పరి­శో­ధ­న­లు, అధు­నా­తన రి­యా­క్ట­ర్ టె­క్నా­ల­జీ­ల­ను బలో­పే­తం చేసే లక్ష్యం­తో బాబా అటా­మి­క్ రీ­సె­ర్చ్ సెం­ట­ర్ (బా­ర్క్) ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని అన­కా­ప­ల్లి జి­ల్లా­లో సు­మా­రు 3,000 ఎక­రాల వి­స్తీ­ర్ణం­లో భారీ పరి­శో­ధన, అభి­వృ­ద్ధి కేం­ద్రా­న్ని (R&D) ఏర్పా­టు చే­య­నుం­ది. ఈ ప్ర­తి­ష్టా­త్మక ప్రా­జె­క్టు కోసం ఇప్ప­టి­కే రె­వె­న్యూ భూ­మి­ని సే­క­రిం­చా­రు. దీ­ని­కి అత్యంత కీ­ల­క­మైన 148.15 హె­క్టా­ర్ల అటవీ భూ­మి­ని బద­లా­యిం­చేం­దు­కు కేం­ద్ర పర్యా­వ­రణ మం­త్రి­త్వ శాఖ ని­పు­ణుల కమి­టీ ఇటీ­వల సూ­త్ర­ప్రాయ ఆమో­దం తె­లి­పిం­ది. దీం­తో ని­ర్మాణ పను­ల­కు తొలి అడ్డం­కి తొ­ల­గి­పో­యిం­ది. దే­శీ­యం­గా అణు ఆవి­ష్క­ర­ణ­లు, స్వ­చ్ఛ ఇంధన వన­రు­ల­పై కేం­ద్ర ప్ర­భు­త్వం దృ­ష్టి సా­రిం­చిన తరు­ణం­లో ఈ కేం­ద్రం ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది. ఇది రి­యా­క్ట­ర్ల అభి­వృ­ద్ధి, నూతన ఇంధన సాం­కే­తి­క­త­ల­లో బా­ర్క్ పా­త్ర­ను మరింత వి­స్త­రి­స్తుం­ది. కాగా, బా­ర్క్ ఇప్ప­టి­కే స్మా­ల్ మా­డ్యు­ల­ర్ రి­యా­క్ట­ర్ల (SMRs) డి­జై­న్ పను­ల­ను ప్రా­రం­భిం­చిం­ది.

ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1,200 హెక్టార్లకు పైగా రెవెన్యూ భూమిని సేకరించారు. దీనికి అదనంగా అవసరమైన 148.15 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించేందుకు బార్క్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ ఇటీవల సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ప్రణాళికలో ఈ అటవీ భూమి అత్యంత కీలకం కావడంతో, ఈ అనుమతితో పనులకు తొలి అడ్డంకి తొలగిపోయింది. దేశీయంగా అణు ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అణు పరిశోధనలు, రియాక్టర్ల అభివృద్ధి, నూతన ఇంధన సాంకేతికతలలో బార్క్ విస్తరిస్తున్న పాత్రకు ఈ కొత్త క్యాంపస్ ఊతమిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (SMRs) డిజైన్, అభివృద్ధి పనులను బార్క్ ప్రారంభించిందని కేంద్రం ఈ మధ్యే పార్లమెంటుకు తెలియజేసింది. మరోవైపు, రష్యాకు చెందిన రోస‌టామ్‌తో కలిసి చిన్న, పెద్ద అణు విద్యుత్ ప్రాజెక్టులపై సహకారం కోసం భారత అణుశక్తి విభాగం చర్చలు జరుపుతోంది.

Tags

Next Story