Anandayya: కరోనా, ఒమిక్రాన్ మందుల తయారీపై ఆనందయ్యకు ఆయుష్ విభాగం షాక్..

Anandayya (tv5news.in)
Anandayya: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు ఆయుష్ విభాగం షాక్ ఇచ్చింది. కరోనా, ఒమిక్రాన్ మందుల తయారీ, పంపిణీ వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను బలహీనపరుస్తానంటూ పత్రికలో ఇచ్చిన ప్రకటన చట్టానికి విరుద్ధంగా ఉందని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆనందయ్యకు ఆదేశాలు జారీ చేశారు ఆయుష్ కమిషనర్. ఒమిక్రాన్‌ను బలహీనపరుస్తారనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది. ఉంటే వాటిని వెంటనే ఆయుష్ విభాగానికి అందించాలని కోరింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కరోనా సెకండ్‌వేవ్ టైంలో ఆనందయ్య మందుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వేల మంది కృష్ణపట్నంకు ఆనందయ్య మందుకోసం క్యూ కట్టారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దానికి సైతం మందు తయారు చేసినట్లు చెప్పారు. 48 గంటల్లోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను బలహీన పరుస్తామంటూ ప్రకటించారు. గతంలో తయారు చేసిన మందుకే మరికొన్ని మూలికలు జోడించి మందు తయారు చేశామని ప్రకటన ఇచ్చారు ఆనందయ్య. ఇప్పుడు దీనిపై ఆయుష్ విభాగం సీరియస్ అయింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా మందు పంపిణీ చేయడం కుదరదని, ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆనందయ్యను హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com