Anantapuram : అప్పుకోసం వచ్చి అసువులు బాసిన రైతు

Anantapuram : అప్పుకోసం వచ్చి అసువులు బాసిన రైతు

అనంతపురంలో విషాదం నెలకొంది. అప్పుకోసం వచ్చి అసువులు బాశాడు ఓ రైతు.పంట రుణాన్ని రెన్యువల్‌ చేసుకునేందుకు..ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి గ్రామీణ బ్యాక్‌ చుట్టూ ప్రదక్షణలు చేసిన రైతు వెంకట రామిరెడ్డికి పలు కారణాలు చెప్పి తిప్పించుకున్నారు బ్యాంక్‌ అధికారులు.అప్పు రెన్యువల్‌ అవుతుందో లేదో అన్న ఆందోళన చెందాడు.రుణభారం ఎక్కువై పోతుందన్న బాధతో గుండెపోటుకు గురై కన్ను మూశాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా శనగల గూడూరు గ్రామంలో నెలకొంది. రాష్ట్రంలో సకాలంలో రైతులకు రుణాలు అందక ప్రాణాలు రైతులు వదులుతున్నారనేందుకు ఈ ఘటనే తార్కాణం అంటున్నారు రైతు సంఘం నేతలు.

Tags

Read MoreRead Less
Next Story