Anantapuram: భూమి కబ్జా, రైతు ఆత్మహత్యాయత్నం

Anantapuram: భూమి కబ్జా, రైతు ఆత్మహత్యాయత్నం
కలెక్టర్‌, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా రైతుకు జరగని న్యాయం, మనస్తాపంతో పురుగుల మందు తాగిన రైతు

అనంతపురం జిల్లాలో రైతుల భూముల కబ్జాకు గురవుతున్నాయి. కబ్జారాయుళ్ల భూదాహానికి అమాయక రైతులు బాధితులుగా మిగులుతున్నారు. యాడికి మండలం కోన ఉప్పలపాడులో రైతు లక్ష్మన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన భూమిని వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి కబ్జా చేశారని బాధిత రైతు ఆరోపించారు.


యాడికి మండలం కోనుప్పలపాడులో రత్నకుమారి అనే దళిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారంగా 5.64 ఎకరాల భూమిని కేటాయించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి భూమిని ఆక్రమించి మొక్కలు నాటించారని రైతు లక్ష్మన్న తెలిపారు. ఎన్నిసార్లు కలెక్టర్, తహశీల్దార్‌కు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఐదు రోజుల క్రితం యాడికి తహసీల్దార్‌ కార్యాలయంంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు రైతు లక్ష్మన్న. పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో కిందకు దిగారు. అధికారులు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో పురుగుల మందు తాగి మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. తనకేం జరిగినా వైసీపీ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, అతనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలని బాధితుడు తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story