SIT: లడ్డూ కల్తీ విచారణకు సిట్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు... దానిపై డీజీపీతో చర్చిస్తున్నారు. సచివాలయంలో పోలీసు, ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. సిట్ ఏర్పాటుపై డీజీపీతో సహా ఉన్నతాధికారులతో చంద్రబాబు చర్చిస్తున్నారు. సిట్ చీఫ్‌గా సీనియర్ ఐజీ నియమాకంపైనా సమాలోచనలు చేస్తున్నారు. అధికారులు శ్రీకాంత్, త్రిపాఠి, వినీత్ పేర్లను పరిశీస్తున్నారు. నెయ్యి కొనుగోలు, టెండర్ ప్రక్రియపై సిట్ విచారణ చేపట్టనుంది.
తప్పు తప్పే..: చంద్రబాబు
మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు, ఇతర మతస్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని చంద్రబాబు అన్నారు. అన్నింటి కంటే పెద్దదైన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన సమయంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయన్నారు. వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా, వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగించుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దానిపై చాలా మంది బాధపడ్డారని తెలిపారు. ఏదైనా మళ్లీ ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత మేం తీసుకుంటామని... భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు సమీక్ష
మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ ను పుర్తి చేయాలని అధికారులను సీఎం అదేశించారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మైనార్టీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా మైనార్టీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com