Andhra Pradesh : మంత్రి రోజా చెప్పులు మోసిన టూరిస్టు అధికారి

మంత్రి రోజా నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా మేడంగారికి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు మరీ. అసెంబ్లీలోనైనా, ఆలయ ప్రాంగణంలోనైనా మేడం గారి రూటే సెపరేటు అనడంలో సందేహమే లేదు. కబడ్డీ ఆడినా బీచ్‌లో కేరింతలు కొట్టినా హెడ్‌లైన్స్‌కి ఎక్కడం మాత్రం పక్కా. శుక్రవారం ఉదయం సూర్యలంక బీచ్‌కి వెళ్లిన మంత్రి రోజా అక్కడ కాసేపు కేరింతలు కొట్టింది. అలలతో ఆడుకుంది.
ఈ క్రమంలో మేడం గారు చెప్పులు తడవకుండా పక్కన విడిచి వెళ్లింది. అక్కడితో బాగానే ఉంది కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆమె చెప్పులను చూసిన పర్సనల్ అసిస్టెంట్ వాటిని పట్టుకోమన్నట్లు టూరిస్టు అధికారికి ఓ లుక్కిచ్చాడు. దీంతో చేసేదేమీ లేక అధికారి నాగరాజు మంత్రి చెప్పులు చేతపట్టుకున్నాడు. ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొట్టేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా అధికారులు ఆ స్థాయికి దిగజారడం ఏమీ బాగోలేదని విమర్శిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com