Andhra Pradesh : మంత్రి సురేష్‌కు నిరసన సెగ

X
By - Vijayanand |12 Feb 2023 5:51 PM IST
ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు నిరసన సెగ తగిలింది. యర్రగొండపాలెం చైతన్య నగర్‌లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు మంత్రి. దాంతో స్థానిక సమస్యలపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మహిళలు, ప్రజలు నిలదీశారు. మంచినీరు, డ్రైనేజీ, ఫించను సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫైర్ అయ్యారు. అయితే మంత్రికి ప్రజలు సమస్యలు చెప్పే సమయంలో వీడియో తీయొద్దంటూ మీడియా వాళ్లపై
మంత్రి గన్‌మెన్లు హల్‌చల్ చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా .. టీవీ5 ప్రతినిధిని పక్కకు తీసుకెళ్లమని పోలీసులను ఆదేశించడం దుమారం రేపింది. సమస్యలు తీర్చలేక విలేఖరులపై అసహనమా అంటూ మంత్రిని స్థానికులు నిలదీసారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

