Andhra Pradesh: హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు

Andhra Pradesh: హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు
ఏ.పీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జీఏడి ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై స్టే విధిస్తూ ఉత్తర్వులు

హైకోర్ట్‌ లో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఏ.పీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జీఏడి ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది హైకోర్టు. నిబంధనలు ఉల్లంఘించారని ఉద్యోగులకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది జీఏడి. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసుల్లో కోరింది. అయితే జీఏడి ఇచ్చిన షోకాజ్ నోటీసును హైకోర్టులో సవాల్ చేసిందిప్రభుత్వ ఉద్యోగుల సంఘం. పిటీషనర్ల తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు న్యాయవాది ఉమేష్చంద్ర, సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు షోకాజ్ నోటీసు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జీఏడిని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసుపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story