Andhra Pradesh : నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఆవేదన

బయటకు గంభీరంగా కనిపిస్తున్నా మనసులో చాలా బాధతో నెట్టుకొస్తున్నానని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్ గుడబండి ఆదిలక్ష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఛైర్ పర్సన్ పదవి చేపట్టి మరో రెండు నెలల్లో రెండు సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో ఆమె తన మనసులో గూడు కట్టుకున్న ఆవేదనను వెలిబుచ్చారు.
రెండేళ్లుగా సొంత పార్టీ నేతలనుంచే తీవ్ర వివక్షను ఎదుర్కొన్నానని తెలిపారు. కొంత మంది పార్టీ నేతలు కావాలనే విధులకు ఆటంకం కలిగించారని...ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా ప్రమేయం లేకుండానే ..అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపోయారు. నర్సీపట్నంలో రోడ్డు విస్తరణ పనుల గురించి కూడా తనకు తెలియదన్నారు మున్సిపల్ ఛైర్మన్ ఆదిలక్ష్మి. సొంత పార్టీ నేతలపై ఆదిలక్ష్మి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com