Andhra Pradesh : ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు .. సామాన్యుడి భారం

ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు .. సామాన్యుడి పోటుగా మారుతోంది. తాజాగా 2021-22 వార్షిక సంవత్సరంలో డిస్కమ్‌లు కొనుగోలు చేసిన విద్యుత్తు కొనుగోళ్ల సర్దుబాటును 2023-24లో సర్దుబాటు కింద వసూలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ డీస్కంలు కోరింది. దీనికి ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అప్పుడెప్పుడో వినియోగించిన కరెంట్‌కు ఇప్పుడు చెల్లించాలని డిస్కమ్‌లు లెక్కలు వేయడం, దానికి ఈఆర్‌సీ అంగీకరిచండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
2021-22లో విద్యుత్తు కొనుగోళ్లు, విక్రయాల ఆదాయంలో వచ్చిన తేడా 3,082 కోట్లు, ప్రవాహ, ప్రసార నష్టాలు మరో రూ.456 కోట్లు మొత్తం కలిపి 3,538 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెలకు యూనిట్‌కు సగటున 29పైసల చొప్పున వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఈ సర్దుబాటు 20పైసలతో ప్రారంభమై 67 పైసల వరకూ ఉంటోంది. మరోవైపు.... వ్యవసాయానికి కరెంట్ తక్కువగా సరఫరా చేసినందున ప్రభుత్వానికి 376కోట్లు తిరిగి ఇచ్చేయాలని డిస్కమ్‌లను ఆదేశించింది ఈఆర్‌సీ.ఇంధన సర్దుబాటుపై గతనెల 10న ఈఆర్‌సీ ప్రజాభిప్రాయాన్ని కోరింది. సర్దుబాటు చార్జీలు వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వు జారీ చేయడంపై విపక్షాలు మండిపడతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com