Andhra Pradesh : ఏపీ రోడ్లపై తెలంగాణ ఎంపీ కామెంట్

Andhra Pradesh : ఏపీ రోడ్లపై తెలంగాణ ఎంపీ కామెంట్

ఏపీ రోడ్ల దుస్థితిపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. అల్లూరి జిల్లా పాడేరులో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్న ఆయన 80 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఏపీ రోడ్ల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. పాడేరు ప్రజలు విశాఖ ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా ప్రధాన కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పాడేరు గిరిజ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు.

Read MoreRead Less
Next Story