Andhra Pradesh : ఆర్మీ జవాన్‌పై వైసీపీ నేతల దాడి

Andhra Pradesh : ఆర్మీ జవాన్‌పై వైసీపీ నేతల దాడి

సత్యసాయి వైసీపీ నేతలు అరాచకానికి దిగారు. ఓ ఆర్మీ జవాన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తుమ్మల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ సమరసింహారెడ్డిపై దాడికి దిగారు. పొలాల్లో వెంటాడుతూ.. దుర్భాషలాడుతూ... చికతబాదారు. తీవ్రం గాయపడిన జవాన్ సమరసింహారెడ్డి..... వైసీపీ నేతల నుంచి తప్పించుకుని.. ఆసుపత్రిలో చేరాడు. ఆ జవాన్ తండ్రి టీడీపీ నేత కావడం, టీడీపీ నేత పరిటాల శ్రీరాంను తమ ఇంటికి ఆహ్వానించడమే అతడు చేసిన నేరం.

ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో మంగళవారం పోతులయ్య స్వామి గావుల మహోత్సవం జరిగింది. ఈ ఉత్సవం సంధర్బంగా... ఆ గ్రామ టీడీపీ నేత, జవాన్ సమరసింహారెడ్డి తండ్రి అయిన నరసింహారెడ్డి... టీడీపీ నేత పరిటాల శ్రీరాంను తన ఇంటికి ఆహ్వానించారు. పరిటాల శ్రీరాం వస్తుండటంతో.. తన ఇంటి ముందు అడ్డుగా ఉన్న ఓ కారును పక్కకు తీయమని డ్రైవర్కు చెప్పాడు సమరసింహారెడ్డి. అయితే.. ఆ డ్రైవర్.. కారు ఎవరిదనుకున్నావ్.. కామిరెడ్డి సుధాకర రెడ్డిది.. చూసుకుని మాట్లాడంటూ... హెచ్చరించాడు. అనంతరం.. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు డ్రైవర్. దీంతో.. రెచ్చిపోయిన ఆయన అనుచరులు... కాపు కాసి సమరసింహారెడ్డి పై దాడి చేశారు.

ఈ దాడిలో... సమరసింహారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని.. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ పరామర్శించారు. ధర్మవరం ఆసుపత్రికి తరిలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం.. సమరసింహారెడ్డిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు పరిటాల శ్రీరామ్‌...

Read MoreRead Less
Next Story