Andhra Pradesh : అనుచరులతో కన్నా భేటీ

అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత వరుస సమాావేశాలు నిర్వహిస్తుండటంతో తన భవిష్యత్ రాజకీయాలపై అనుచరులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన నివాసంలో కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు జిల్లాలకు చెందిన కన్నా సానుభూతి పరులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
కార్యకర్తలతో కన్నా భేటీ ముగియడంతో.. కాసేపట్లో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. కన్నాకు గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తారకరత్న మృతి బాధాకరమన్న కన్నా.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com