Andhra Pradesh : పార్టీ గుర్తింపు రద్దయ్యే ప్రమాదంలో వైసీపీ !?

ఏపీలో వైసీపీ.... కేంద్ర ఎన్నికల కమిషన్ రాడార్‌లో ఉందా? ఆ పార్టీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించిందా? అదే జరిగితే వైసీపీ గుర్తింపు రద్దయ్యే ఛాన్స్ ఉందా? ఇలాంటి ప్రశ్నలతో... ఓ జాతీయ పత్రిక సంచలనాత్మక కథనాన్ని రాసింది. వైసీపీ పేరు, శాశ్వత అధ్యక్షుడి నియామకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆ కథనంలో వెల్లడించింది.
వైసీసీ.. ప్రజాస్వామ్య ప్రక్రియ పద్ధతుల్ని పాటిస్తోందా? అన్న కోణంలో.... కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు అందులో తెలిపింది. నాయకుడికి అపరిమిత అధికారాలు కట్టబెట్టడం అప్రజాస్వామ్యమని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని, రాజకీయ పార్టీలు చేసే అప్రజాస్వామిక సవరణలను గుర్తించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతతో ఉన్నట్లు ఆ కథనంలో వెల్లడించింది.
జగన్ పార్టీని... వైయస్సార్ కాంగ్రెస్‌గా పిలుస్తున్నారని, వాస్తవానికి ఆ పార్టీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా రిజిస్టర్ అయిందని సీఈసీ వెల్లడించింది. వైసీపీ రాజ్యాంగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశిస్తున్నట్లు వెల్లడించింది. ఇక... జగన్‌ని శాశ్వత అధ్యక్షుడిగా ప్లీనరీలో తీర్మానం చేయడంపైనా... గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. దీనిపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసిందని, వివరణ ఇచ్చిన తర్వాత... పార్టీ రాజ్యాంగంపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com