Andhra Pradesh : ఉచిత బియ్యం పంపిణీకి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. కారణం అదే..

Andhra Pradesh : ఉచిత బియ్యం పంపిణీకి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. కారణం అదే..
X
Andhra Pradesh : కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

Andhra Pradesh : కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.. వచ్చేనెల 1 నుంచి ఉచిత బియ్యాన్ని అందజేయనుంది.. అయితే, ఇందులోనూ మెలికపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం గుర్తించిన కార్డు దారులకు మాత్రమే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది..

కేంద్రం జాబితాలో ఉన్న NFSA కార్డుదారులు 88 లక్షలా 76వేలా 255 మందికే బియ్యం పంపిణీ చేయనుంది.. వాలంటీర్ల ద్వారా వీరికే మాత్రమే స్లిప్పులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.. ఇక నాన్‌ NFSA కార్డుదారులు 56 లక్షల 66వేలా 437 మందికి రెండో కోటా బియ్యం సరఫరా ఉండబోదు.. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందనే ఉద్దేశంతో పేదవాళ్లకు బియ్యం సరఫరా నిలిపివేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story