TTD: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలిని నియమించారు. బోర్డులో ఎమ్మెల్యేలు, కేంద్ర మాజీ మంత్రి, వ్యాపారవేత్తలు సహా పలు రంగాల వారు చోటు దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. మాజీ సీజేఐ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు
బీఆర్ నాయుడు- టీటీడీ ఛైర్మన్
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) - టీటీడీ సభ్యులు
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే) - టీటీడీ సభ్యులు
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే) - టీటీడీ సభ్యులు
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి) - టీటీడీ సభ్యులు
సాంబశివరావు (జాస్తి శివ) - టీటీడీ సభ్యులు
శ్రీసదాశివరావు నన్నపనేని - టీటీడీ సభ్యులు
కృష్ణమూర్తి - టీటీడీ సభ్యులు
కోటేశ్వరరావు - టీటీడీ సభ్యులు
మల్లెల రాజశేఖర్ గౌడ్ - టీటీడీ సభ్యులు
'జంగా కృష్ణమూర్తి - టీటీడీ సభ్యులు
దర్శన్. ఆర్.ఎన్ - టీటీడీ సభ్యులు
జస్టిస్ హెచ్‌ఎల్ దత్ - టీటీడీ సభ్యులు
శాంతారామ్ - టీటీడీ సభ్యులు
పి.రామ్మూర్తి - టీటీడీ సభ్యులు
జానకీ దేవి తమ్మిశెట్టి - టీటీడీ సభ్యులు
బూంగునూరు మహేందర్ రెడ్డి - టీటీడీ సభ్యులు
అనుగోలు రంగశ్రీ - టీటీడీ సభ్యులు
బురగపు ఆనందసాయి - టీటీడీ సభ్యులు
సుచిత్ర ఎల్లా - టీటీడీ సభ్యులు
నరేశ్‌కుమార్ - టీటీడీ సభ్యులు
డా.అదిత్ దేశాయ్ - టీటీడీ సభ్యులు
శ్రీసౌరబ్ హెచ్ బోరా - టీటీడీ సభ్యులు
వేరే రాష్ట్రాల వారు ఇలా..
తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పించగా.. కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి రెండు.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికీ టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది. ఇక టీటీడీలో మొత్తం 25 మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 24 మంది పేర్లను ప్రకటించారు. అయితే మరొక సభ్యుడిని నియమించాల్సి ఉండగా.. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com