APలో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్

APలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. జగన్ సర్కార్ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉందంటున్న విశ్లేషకులు… తెలంగాణతో పాటు ఏపీలోను డిసెంబర్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వారంలో మూడు రోజులపాటు సీఎం జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముందస్తులో భాగంగానే జగన్ స్పీడ్ పెంచారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజమహేంద్రవరం మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీ… దానికొచ్చిన అనూహ్యమైన స్పందనతో దూకుడు మీదుంది.
దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామని ఇప్పటికే చంద్రబాబు తేల్చేశారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోతో టీడీపీలో దూకుడు మరింత పెరగనుంది. ఈ నెల 10 నుంచి చంద్రబాబు మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లనున్నారు. భవిష్యత్తు గ్యారంటీ పేరుతో 150 రోజులు ప్రజల్లోనే ఉండనున్నారు. అటు.. పాదయాత్రతో నారా లోకేష్ ప్రజల్లో మమేకమైపోయారు. రాయలసీమలో లోకేష్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు.. ఈ నెలలోనే జనంలోకి జనసేనని వస్తున్నారు. వారాహితో పవన్ ప్రజల్లోకి దూసుకుపోనున్నారు. ఇప్పటికే ఆయన రూట్ మ్యాప్ ఖరారయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com