ఎస్సై శిరీషను అభినందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్!

ఎస్సై శిరీషను అభినందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్!
కాశీబుగ్గ ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు సమీపంలో ఓ గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది.

కాశీబుగ్గ ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు సమీపంలో ఓ గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై శిరీష సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ శవాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని గ్రామస్తులను కోరారు. అయితే ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఎస్సై శిరీష ధైర్యంగా చొరవతీసుకున్నారు.


తన భుజాలపై స్వయంగా ఆ మృతదేహాన్ని పొలం గట్లు వెంబడి దాదాపు 2 కి.మీ మేర మోశారు. మధ్యలో కొందరు వచ్చి శావాన్ని తాము మోస్తామని చెప్పిన అందుకు ఆమె నిరాకరించారు. చివరకు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. విధి నిర్వహణలోనే కాదు సేవ కార్యక్రమంలో వెనుకడుగు వేయని ఎస్సైగా శిరీష గుర్తింపు పొందారు.


Tags

Read MoreRead Less
Next Story