AndhraPradesh: ఉంగుటూరు సొసైటీ బ్యాంక్ లో గోల్‌మాల్

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ బ్యాంక్ లో అవకతవకలు వెలుగు చూశాయి. పేదలు దాచుకున్న సొమ్ము మాయం కావడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. సంవత్సరం నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నా తాము దాచుకున్న డబ్బు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌లో సుమారు నాలుగు కోట్ల రూపాయల సొమ్ము గోల్ మాల్ అయినట్లు బాధితులు చెబుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న సొమ్ము గల్లంతు అవ్వడంతో బాధితులు మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు డబ్బాలు పట్టుకొని బ్యాంక్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. సొసైటీ చైర్మన్ వచ్చి ఉత్తుత్తి హామీలు ఇస్తున్నారని.. స్థానికఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com