AndhraPradesh: రాజధాని విశాఖకు తరలిస్తే..సీమ చూస్తూ ఊరుకోదు

AndhraPradesh: రాజధాని విశాఖకు తరలిస్తే..సీమ చూస్తూ ఊరుకోదు
X
సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించేలా చేస్తున్నాడు

పరిపాలన రాజధాని విశాఖకు తరలిస్తామంటే రాయలసీమ ప్రాంతవాసులు చూస్తూ ఊరుకోరన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌. సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించేలా చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి లేక సీమ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని ఆవేదన చెందారు. తమ ప్రాంతంలో వింటర్‌ కేపిటల్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌ తాను చెప్పిందే వేదం.. ఆదేశాలే హుకుం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తమను పిల్లిలా చూస్తే అవే పిల్లులు సింహాలుగా మారుతాయన్నారు.

Tags

Next Story