AndhraPradesh: వైసీపీ పాలన బాలేదు : ఫారూఖ్ షూబ్లీ

AndhraPradesh: వైసీపీ పాలన బాలేదు : ఫారూఖ్ షూబ్లీ
X
జగన్ పాలనలో ముస్లింలు, మైనారిటీలు ఏమాత్రం సంతోషంగా లేరని వ్యాఖ్య

వైసీపీ పాలన సరిగా లేదని ముస్లీం, మైనారిటీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షూబ్లీ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ముస్లిం, మైనారిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. జగన్ పాలనలో ముస్లింలు, మైనారిటీలు ఏమాత్రం సంతోషంగా లేరని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

బాధితులపైనే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. ముస్లీం, మైనారిటీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ వద్ద బానిసల్లా కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా అభివృద్ది మాత్రం జరగలేదని అన్నారు. ఇకనైనా ప్రజలే మేల్కోవాలని ఆయన తెలిపారు.

Tags

Next Story