AndhraPradesh: గడపగడపలో చేదు అనుభవం.. చేసేది లేక పైసల పంపకం

గడప గడప కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా చేదు అనుభవం ఎదురైతోంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలను ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రశ్నిస్తుండటంతో చేసేదేమీ లేక వెనుదిరుగున్నారు. తాజాగా తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కి నిరసన సెగ తగిలింది. కోట మండలం మద్దాలి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమంలో స్థానికులు ఆయన్ని నిలదీశారు. గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని, ఆ విషయం ప్రస్థావిస్తే సమాధానం దాటవేస్తూ మండిపడ్డ గ్రామస్తులు అర్ధరాత్రి వచ్చి వెళుతున్నాడంటూ మహిళలు మండిపడ్డారు అయితే నా వైపే వేలు చూపుతావా అంటూ ఎమ్మెల్యే మహిళలపై తిరగబడ్డారు. అయితే ఏమాత్రం తగ్గని మహిళలు పోలీసులు లేకుండా రా అంటూ ఎమ్మెల్యేకి సవాల్ విసిరారు. మరో వైపు కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళుతున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నగదు కవర్లు చేతిలో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక్కో కవరులో 2 వేలు,5 వేలు,10 వేలు ఉంటున్నాయి. స్థానిక పరిస్థితులు, సందర్భాన్ని బట్టి తన అనుచరులకు ఏ కవరు ఇవ్వాలనేది ఎమ్మెల్యే సైగ చేస్తుంటారు.ఇందుకు కోసం ఇద్దరు అనుచరులు ఆయన వెన్నంటే ఉంటున్నారు. ఒకరు ఆ రోజుకు కావాల్సిన నగదు కవర్లతో కూడిన సంచిని మెడకు తగిలించుకుని, మరొకరు ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఇచ్చేందుకు వీలుగా పైజేబులో ఓ కవరు పెట్టుకుని ఎమ్మెల్యే వెనుకే ఉంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మొదలు ఈ నగదు పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముందస్తుగానే వంశీ ఈ విధంగా నగదు పంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com