AndhraPradesh: ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణం

AndhraPradesh:  ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి  దారుణం
జీతం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితిలో ఉపాధ్యాయులు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. జీతం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితిలో ఉపాధ్యాయులు ఉన్నారు. పదో తేదీ వచ్చినా ఇప్పటికీ చాలామందికి జీతాలు రాలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు. ఏపీలో జీతం చేతికి అందిందంటే అదో పెద్ద పండగలా తయారైంది. ఏ ఉద్యోగికైనా ప్రతినెలా రుణవాయిదాలు, ఇతర ఖర్చులు ఉంటాయి. వీటికి నిర్దిష్ట తేదీ పెట్టుకుంటారు. ప్రభుత్వం ఎప్పుడు జీతం ఇస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇలాంటివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జనవరి నెల జీతం కోసం నిరసన చేపట్టాల్సిన స్థితికి ఉపాధ్యాయులు వచ్చారు. జీతాలు రాకపోవడంతో వైద్యం, పిల్లల ఫీజులు, బ్యాంకు రుణాల చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా జాప్యం జరుగుతుండడంతో ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

చలో విజయవాడ తర్వాత ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతినెలా ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యంగా వేయడం వెనుక ఆంతర్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆలస్యంగా జీతాలు వేయడం వల్ల ఆర్థికంగా దెబ్బతిని, ఉపాధ్యాయులు కుంగిపోతారని ప్రభుత్వ భావిస్తున్నట్లు ఉందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story