AndhraPradesh: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ ప్రలోభాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా ఆయన వర్గం వైఎస్‌ఆర్ జిల్లాలోని పాఠశాలల్లో గిఫ్ట్‌బాక్స్‌ల పంపిణికి యత్నించారని సమాచారం. అయితే ఈ గిఫ్ట్‌బాక్స్‌లను ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు తిరస్కరించినట్లు తెలుస్తుంది. కొందరైతే కడప వన్‌టౌన్ పీఎస్‌కు ఈ గిఫ్ట్‌బాక్స్‌లను తరలించారు.
బద్వేలు స్కూల్లో గిఫ్ట్‌బాక్సులను రెవిన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు, నందలూరులోనూ ఇదే సీన్ కనిపించింది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు గిఫ్ట్ బాక్సులను కిందపడేసి తొక్కారు. మరికొందరు చెత్తబుట్టల్లోకి విసిరారు. అటు అధికార పార్టీ అభ్యర్థుల ప్రలోభాలపై మిగితా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి అనిల్ ప్రసాద్ వైసీపీ తీరుపై మండిపడ్డారు. జీతాలివ్వలేని ప్రభుత్వం టీచర్లకు బొచ్చెలు పంపిణి చేస్తోందని ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com