AndhraPradesh: గడపగడపలో నిరసన సెగ

వైసీపీ సర్కార్ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నిరసన సెగలు తప్పడం లేదు. తాడి కొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో గడపగడపకు కార్యక్రమాన్ని వైసీపీ నేత కత్తిర సురేష్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి డుమ్మా కొట్టారు. రాజధాని అమరావతి అంశం గురించి ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే హాజరుకాలేదా అంటూ వైసీపీ నేత సురేష్‌ను రాజధాని రైతులు నిలదీశారు. జాబ్ క్యాలెండర్, రోడ్లకు మరమ్మత్తులు, తాగడానికి మంచినీరు, బస్సు సౌకర్యం కూడా లేదంటూ అవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై అభిప్రాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రాజధాని అమరావతి విషయం తన పరిధిలోనిది కాదంటూ వైసీపీ నేతలు వెళ్లిపోయారు. అయితే సమస్యలపై పరిష్కారం కోసం ప్రశ్నించిన మహిళలతో స్థానిక వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com