AndhraPradesh: ఏపీ ఆరోగ్య శాఖ మంత్రికి హైకోర్టు నోటీసులు.. గడువులోగా కౌంటర్ వేయకపోతే కష్టమే
AndhraPradesh

AndhraPradesh: చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మంత్రికి నోటీసులు జారీ చేసిన హై కోర్టు నిర్ణీత గడువులోగా ఆమెకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచించింది.
నోటీసుల ప్రకారం మూడు వారాల తరువాత జరగబోయే తదుపరి హియరింగ్ కల్లా ఆమె కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లా మురకపూడిలో ఉన్న 91ఎకరాల విస్తీర్ణంల ో ఉన్న నాపరాయి ప్రాంతంలో మైనింగ్ అనుమతి ఇస్తూ విడుదలైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు మంత్రి రజినికి నోటీసులు జారీ చేశారు. ఈ మైనింగ్ వ్యవహారంలో ఆమె అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ప్రతాప్ రెడ్డితో పాటూ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారి నుంచి సమాధానాలు కోరుతూ హై కోర్టు నోటీసులు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com