చిత్తూరు జిల్లాలో మరో కారు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో మరో కారు ప్రమాదం
చిత్తూరు జిల్లాలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. అయితే ప్రమాదాన్ని గుర్తించి కారులో ఉన్నవారు అందులోంచి దూకేయ్యడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గంగాధరనెల్లూరు..

చిత్తూరు జిల్లాలో ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. అయితే ప్రమాదాన్ని గుర్తించి కారులో ఉన్నవారు అందులోంచి దూకేయ్యడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గంగాధరనెల్లూరు నియోజవర్గం శ్రీరంగరాజపురం మండలం దుర్గరాజపురం వద్ద చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా వాగు ప్రవాహం ఎక్కువైంది. పద్మాపురంలో పెళ్లికి వెళ్లి వస్తున్నవారి కారు ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారు చాకచక్యంగా దూకెయ్యడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కారు మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది.

Tags

Next Story