AP: ఏపీలో జీబీఎస్ మరణ మృదంగం

AP: ఏపీలో జీబీఎస్ మరణ మృదంగం
X

ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బార్ సిండ్రోమ్‌(GBS) కలకలం కొనసాగుతోంది. ఈ వ్యాధిన పడి వరుసగా మరణిస్తుండడం... భయాందోళనలకు గురిచేస్తోంది. గుంటూరు జీజీహెచ్‌లో షేక్ గౌహర్ జాన్ అనే మహిళ ఇదే వ్యాధితో కన్నుమూసింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి మరణించిందని వైద్యులు తెలిపారు. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్ తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు భయంతో వణికి పోతున్నారు. ఏపీలో జీబీఎస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది అంటువ్యాధి కాదు అని అధికారులు, వైద్యులు చెప్పినప్పటికీ ప్రజల్లో కరోనా తాలూకు భయం వీడటం లేదు. ఈ వ్యాధి లక్షణాలతో ఎవరైనా బాధపడితే వెంటనే పరీక్షలు చేయించుకొని, చికిత్స చేయించుకోవాలని.. ఆలస్యం చేయకూడదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Tags

Next Story