KANAPPA: కన్నప్పకు కొత్త కష్టాలు

KANAPPA: కన్నప్పకు కొత్త కష్టాలు
X
సినిమాపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప సినిమా అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటోంది. చాలా కాలం తరువాత గట్టి కంబ్యాక్ ఇస్తున్న విష్ణు ఈ సారి తన ఖాతాలో కచ్చితంగా హిట్ పడాలని కట్టుదిట్టంగా ప్లాన్ చేశారు. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా.. ‌పాన్ ఇండియా స్టార్స్‌తో, విజువల్స్, గ్రాఫిక్స్‌తో కోట్లు ఖర్చు పెట్టారు. అయితే భక్తి సినిమాలో లవ్ సాంగ్స్ ఉన్నాయని వ్యాఖ్యలు, సినిమా డైలాగ్స్ ట్రోలింగ్, వాయిదా పరంపర, హార్డ్ డిస్క్ దొంగతనం వంటి అనేక అంశాలను కన్నప్ప టీం ఎదుర్కొంది. తాజాగా ఈ సినిమాకు బ్రహ్మణ సంఘాల నుంచి వ్యతిరేకత మెుదలైంది. ఇవన్నీ చూస్తుంటే విష్ణు సినిమా శివయ్యే గట్టేక్కించాలని మంచు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జూన్ 27న విడుదల

జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా రోజులుగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు. విదేశాల్లో, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీ హైప్ పెంచుతున్నారు. శనివారం కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపై బ్రహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. కన్నప్ప సినిమాలో బ్రహ్మణులను కించపరిచేలా ఈ పాత్ర లేదని గుంటూరులో జరగనున్న ఈవెంట్లో ప్రకటించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మోహన్ బాబు కుటుంబానికి బ్రహ్మణులను కించపరచటం అలవాటే అని మండిపడ్డారు. గతంలో విష్ణు 'దేనికైనా రెడీ' సినిమాలో బ్రాహ్మణులను అవమానించారని, తాము హైకోర్టులో రిట్ వేయటంతో సినిమా నుంచి పలు సన్నివేశాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఇకనైనా మోహన్‌బాబు కుటుంబం బ్రహ్మణులను కించపరిచే సన్నివేశాలను చిత్రీకరించటం మానుకోవాలని పేర్కొన్నారు.

ఫైనల్ కాపీ చూసిన విష్ణు

విడుదలకు సిద్ధంగా ఉన్న 'కన్నప్ప' మూవీ ఫైనల్ కాపీపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని విష్ణు ఇదివరకే తెలిపారు.

Tags

Next Story