అంతర్వేదిలో అలల తాకిడి.. ముందుకొచ్చిన సముద్రం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరం దగ్గర ఆందోళనకర పరిస్థితి కనబడుతోంది.. అంతర్వేది బీచ్‌లో సముద్రం వున్నట్టుండి ముందుకు చొచ్చుకు వచ్చింది.. దాదాపు తీరమంతా మునిగిపోయి నీరే కనిపిస్తోంది.. అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు.. 25 మీటర్ల మేర సముద్రం ముందుకు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
అటు అలల తాకిడితో అక్కడే వున్న రెసిడెన్షియల్ భవనం ధ్వంసమైంది.. అలల ఉధృతికి కింద నేలంతా కొట్టుకుపోవడంతో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.. 70 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.. మరోవైపు సముద్రం ముందుకు చొచ్చుకు రావడం, భీకర అలలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 20 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు.. అయితే, ఈ పరిస్థితికి కారణమేంటనేది తెలియడం లేదంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com