అరెస్టైన బీజేపీ, జనసేన కార్యకర్తలు విడుదల
By - Nagesh Swarna |17 Sep 2020 9:27 AM GMT
కాకినాడ సబ్ జైలు నుంచి విడుదలైన కార్యకర్తలకు.. బీజేపీ-జనసేన, ధార్మిక సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు.
అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసగా బీజేపీ-జనసేన నిర్వహించిన ఆందోళనలో అరెస్టైన 37 మంది కార్యకర్తలు జైలు నుంచి విడుదలయ్యారు. కాకినాడ సబ్ జైలు నుంచి విడుదలైన కార్యకర్తలకు.. బీజేపీ-జనసేన, ధార్మిక సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు. సబ్‌జైలు నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో బీజేపీ హిందూ ధర్మ రక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. యువకులపై కుట్రపూరిత కేసులు నమోదు చేసి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం దారుణమన్నారు. కేసులు ఎత్తివేసే వరకు కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపైన దాడులు జరగడం అమానుషమన్నారు. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com