AP: నెల్లూరు నేతల విషయంలో సీఎం జగన్ మంతనాలు

ఏపీలో అధికార పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దూమారం రేపుతుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలతో నేతల గుండెల్లో గుబులు మొదలయ్యింది. తనతో పాటు మరి కొందరి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు కోటంరెడ్డి బాంబు పేల్చారు. ఇక ఈ నేపథ్యంలోనే సీఎంవోలో హడావుడి నెలకొంది. వరుస సమావేశాలతో హీటెక్కింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేర్వేరుగా జగన్‌తో సమావేశం అయ్యారు. కోటంరెడ్డి, ఆనం వ్యవహారంపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా సీఎంవోలో ఉన్నతాధికారులను కలిసి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై చర్చించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సీఎంవో కార్యాలయంలో పరిణామాలు ఒక్కసారిగా వేడిక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com