AP : నారాయణ కాలేజీలో ఉరి వేసుకున్న విద్యార్థి..!?

AP : నారాయణ కాలేజీలో ఉరి వేసుకున్న విద్యార్థి..!?
X
ధరణేశ్వర్‌ది హత్యే అంటూ కుటుంబ సభ్యుల నిరసన

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఉద్రిక్తత నెలకొంది. శనివారం నారాయణ కాలేజ్‌ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్ధి ధరణేశ్వర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ధరణేశ్వర్‌ది హత్యే అంటూ నిరసన వ్యక్తం చేస్తూ కాలేజ్‌ అద్దాలు ధ్వంసం చేశారు మృతుని బంధువులు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే తమ ఆవేదనను పట్టించుకోకుండా, అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ పోలీసులపై తిరగపడ్డారు మృతుని కుటుంబ సభ్యులు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story