AP : మద్యం బాటిళ్లు కొంటే ఫోటోలు తీస్తున్నారు

AP : మద్యం బాటిళ్లు కొంటే ఫోటోలు తీస్తున్నారు
ఏపీలో మందుబాబులకు మద్యం దుకాణాల సిబ్బంది షాకిస్తున్నారు. మూడుకు మించి బాటిళ్లు కొంటే ఫోటోలు తీస్తున్నారు.

ఏపీలో మందుబాబులకు, మద్యం దుకాణాల సిబ్బంది షాకిస్తున్నారు. మూడుకు మించి బాటిళ్లు కొంటే సెలఫోన్లతో ఫోటోలు తీస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. మూడు మద్యం సీసాలు అడిగితే చాలు, ఫోన్‌తో ఫోటో క్లిక్‌ మనిపిస్తున్నారు మద్యం షాపు సిబ్బంది. ఎందుకు ఫోటోలు తీస్తున్నారని మందుబాబులు ప్రశ్నించడంతో, సమాధానాలు చెప్పడం లేదు. దీంతో మందుబాబులకు, షాపు సిబ్బందికి వాగ్వాదం జరుగుతుంది.

గత కొద్ది రోజులుగా.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మద్యం దుకాణాల్లో మూడు, అంతకన్నా ఎక్కు బాటిళ్లు తీసుకునేవారి ఫోటోలు తీస్తున్నారు. ఎందుకు ఫోటోలు తీస్తున్నారని అడిగితే, వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక చోట కొన్న వ్యక్తి మరో ప్రాంతానికి వస్తే గుర్తించేందుకే ఫోటోలు తీస్తున్నామంటున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మందుబాబులు. తమ అనుమతి లేకుండా ఫోటోలు ఎలా తీస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

Read MoreRead Less
Next Story