AP: రేగుల గడ్డలో హలో నేస్తం ప్రారంభం

పల్నాడు జిల్లా మాచవరం రేగుల గడ్డ గ్రామంలో హలో నేస్తం కార్యక్రమాన్ని పల్నాడు హాస్పటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మూడో విడతగా ఉచిత బస్సు సర్వీస్‌ను పేద ప్రజల కోసం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి బుధవారం రేగులగడ్డలో బస్సు మొదలై వేమవరం, తురకపాలెం, మాచవరం, గాంధీనగర్ గ్రామాల మీదుగా పిడుగురాళ్లలోని పల్నాడు ఆసుపత్రికి బస్సు చేరుకుంటుందన్నారు. బస్సు ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా 30 నుంచి 50 శాతం రాయితీ సదుపాయాన్ని కలిపిస్తున్నట్లు తెలిపారు. పల్నాడులో రోగులు చూపించుకున్న అనంతరం తిరిగి ఉచిత బస్సు ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com