AP: రాజధాని అంశం మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతోంది: కేంద్రం

AP: రాజధాని అంశం మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతోంది: కేంద్రం
రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి రాతపూర్వక సమాధానం

ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ విభజన చట్టం సెక్షన్‌ 56 ప్రకారం కేంద్రం రాజధాని నిర్మాణం అధ్యయానికి నిపుణుల కమిటీ వేసిందని పేర్కొన్నారు. అధ్యయన నివేదికను తదుపరి చర్యలు కోసం ఏపీ ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. 2015లో ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని కానీ 2020లో 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారన్నారు. 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కనీసం కేంద్రాన్ని కూడా సంప్రదించలేదన్నారు. రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసినందున ప్రస్తుతం దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story